బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:57 IST)

ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్నది. అదేవిధంగా మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడ్డారు.
 
ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో షరీఫ్ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. మరోవైపు ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కేసుల విషయంలో తమిళనాడును వెనక్కి నెట్టి దేశంలో రెండో స్థానానికి చేరింది.
 
ఆగస్టు 31 తేదీ సాయంత్రానికి ఆంధ్రాలో 4,34,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,00,276 యాక్టివ్ కేసులుండగా 3,30,526 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,969కి చేరింది.