భారత్‌లో కొత్తగా మరో 69,921 కరోనావైరస్ పాజిటివ్ కేసులు
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 69,921 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 65,081 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో మొత్తం 36,91,173 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,85,996 ఉండగా 28,39,882 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 65,288 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.94శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.77 శాతానికి మరణాల రేటు తగ్గింది.
దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.29 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,16,920 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు దేశంలో 4,33,24,834 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.