శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:17 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాపించని జిల్లాలు ఏవి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. నిజానికి ఈ వైరస్ ఆరంభంలో అదుపులోనే ఉన్నది. ఆ తర్వాత విశ్వరూపం దాల్చింది. దీనికి కారణం ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మత సమ్మేళనమే కారణమని తేలింది. ఫలితంగా ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
తాజాగా తాజా అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 180 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 4, కడప జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.
 
జిల్లాల వారీగా చూస్తే, నెల్లూరు జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 27, కడప జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 23, ప్రకాశం జిల్లాలో 18, విశాఖ జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 2 నమోదయ్యాయి.
 
అయితే, ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ రెండు జిల్లాలు ప్రస్తుతానికి సేఫ్ జోన్‌‌లో ఉన్నట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఇందుకూరు పెటను రెడ్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. అలాగే, గుంటూరు జిల్లాలో ఆరు జోన్లను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు.