గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (13:40 IST)

ఏపీలో కోవిడ్ క‌ర్ఫ్యూ పొడిగింపు... సెప్టెంబర్ 4 వరకు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 4 వరకు రాత్రి 11గం.ల నుండి ఉదయం 6గం.ల వరకు కోవిడ్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జిఓ ఆర్టీ సంఖ్య 456 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈమేరకు కర్ఫ్యూ సమయాల్లో సడలింపు నిర్ణయం తీసుకున్న‌ట్లు అనిల్ కుమార్ సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సెప్టెంబర్ 4 వరకు రాత్రి 11గం.ల నుండి ఉదయం 6గం.ల వరకు అమలులో ఉండే ఈ కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్లు 51 నుండి 60, భారత శిక్షా స్మృతి (IPC) లోని సెక్షన్ 188,ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామ‌న్నారు.