బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జులై 2020 (09:24 IST)

ఏపీలో 91 కేంద్రాలలో కోవిడ్ పరీక్షలు ఉచితం

ప్రస్తుతం రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న కోవిడ్19 పాజిటివ్ కేసుల దృష్ట్యా రాబోయే కాలంలో ఏర్పడబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలో కోవిడ్19 పాజిటివ్ కేసులను నియంత్రించడానికి తగిన చర్యలు చేపట్టింది.
 
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో సుమారు 91 కోవిడ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 7 ప్రైవేట్ సంస్థల అధ్వర్యంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 
 
తద్వారా కోవిడ్ పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వివిధ ఆసుపత్రులలో పడకల లభ్యతను కూడా పెంచడం జరిగింది. 
 
ప్రభుత్వ సౌకర్యాలతో  రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన సుమారు 91 కేంద్రాలలో కోవిడ్ పరీక్షలు ఉచితంగా చేయబడతాయి. మన రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉన్నటువంటి టెస్టింగ్ సెంటర్ల వివరాలు జత చేయబడ్డాయి.

అలాగే వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ  ప్రకారము ప్రైవేట్ ల్యాబ్స్‌లో కోవిడ్ పరీక్ష కోసం వసూలు రేట్లు ఈ క్రింది విధంగా నిర్ణయించబడ్డాయి. 
 
ప్రయివేటు ప్రయోగశాలలో కోవిడ్ పరీక్ష చేయించుకునే వ్యక్తులు ఒక  నమూనాకు రూ .2900 చెల్లించాల్సి ఉంటుంది. (పరీక్ష, ఇతర ఖర్చులను కలిగి ఉంటుంది)
 
ఆస్పత్రుల్లో పడకల సామర్ధ్యం పెంపు:
కోవిడ్ పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతుండడండతో వారి అవసరాలకు తగ్గట్టుగానే  ప్రభుత్వం ఇప్పటికి సుమారు 41,114 పడకలను సిద్దం చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. 
 
రాష్ట్రంలోని అన్ని పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, ఏరియా హాస్పిటల్స్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ వద్ద ఏదైనా పని రోజున ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య కోవిడ్ నమూనాలను సేకరిస్తారు. 
 
ఈ పడకలకు అదనంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో గల ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా బిపిఎల్ & ఎపిఎల్ కుటుంబాలలోని కోవిడ్ -19 పాజిటివ్ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 
 
చికిత్స విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందనవసరం లేదని అత్యవసర పనులు, వ్యక్తిగత పనుల కోసం బయటకు వచ్చే వారు ముక్కు, ముఖానికి సరైన మాస్క్ ధరించడమే కాకుండా ఇతరులతో భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం కోరుచున్నది.