మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జులై 2020 (22:51 IST)

చంద్రబాబు ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి: మంత్రి కన్నబాబు

అధికారం రాలేదని ప్రజలపై చంద్రబాబు కక్షసాధిస్తున్నారని ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా అప్రాప్రియేషన్‌ బిల్లు ఆమోదం కాకుండా అడ్డుకున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీనివల్ల ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేకపోయామన్న ఆయన.. కేవలం 
ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.  చంద్రబాబు ప్రజలకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేవలం బిల్లులను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ సభలో వ్యవహరించిందని, బిల్లును ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీ అడ్డుకుందన్నారు. బిల్లును అడ్డుకున్న విషయంలో దురుద్ధేశ్యాలు లేకుంటే,  చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు.

క్షమాపణ చెపితే సీనియార్టీ కాపాడుకున్నవారవుతారని, ఎక్కువ కాలం సీఎం.. ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు, ఉద్యోగుల జీతాలను అడ్డుకున్న చరిత్ర కూడా సృష్టించారన్నారు. ఇవాళ పేదల సంక్షేమం పై చిత్తశుద్ది ఉంది కాబట్టే పించన్లు ఇవ్వగలిగామన్న మంత్రి కన్నబాబు, చాలా కీలకమైన అంశాలని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు  అజయ్‌ కల్లాంతో కలిసి మీ ముందుకు వచ్చామన్నారు.

ఈ రాష్ట్రంలో తనకు అధికారం రాలేదని ప్రజలు తనకి, ఆయన అనుకున్నట్టుగా అధికారం కట్టబట్టలేదని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలని కక్ష సాధిస్తున్న తీరు కొద్ది రోజుల నుంచి చూస్తా ఉన్నామని, దానికి నిదర్శనమే అప్రాప్రియేషన్‌ బిల్లుని కౌన్సిల్‌లో పాస్‌ కాకుండా అడ్డుకోవడమని తేల్చి చెప్పారు.

ఈ రాష్ట్ర చరిత్రలో గడిచిన 50 సంవత్సరాల్లో తీసుకుంటే కౌన్సిల్‌లో ఎప్పుడూ కూడా ఈ రకంగా బడ్జెట్‌ను పాస్‌ కాకుండా అడ్డుకున్న చరిత్ర ఎప్పుడూ లేదని. తొలిసారి అలాంటి తన మార్కు చరిత్రని, తన మార్కు టార్గెట్‌ని నమోదు చేసుకున్న ఘనత చంద్రబాబు నాయుడుగారికే దక్కిందన్నారు. కనీసం ప్రజలేమైపోతారు, ఉద్యోగులేమైపోతారు, ఈ విధంగా అప్రాప్రియేషన్‌ బిల్లును అడ్డుకుంటే రేపు జీతాలివ్వలేని పరిస్ధితి వస్తుంది.

అత్యవసర ఖర్చు కూడా చేయలేని పరిస్ధితి వస్తే, దీనికి ఎవరకు జవాబుదారీ అని కూడా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు తన కుటిల రాజకీయ అవసరం కోసం ప్రజల మీద ఈ కక్ష సాధింపు చర్య చేశారని మండిపడ్డారు. దానివల్ల మొట్టమొదటి సారిగా ఈ నెల సకాలంలో జీతాలివ్వలేని పరిస్ధితి వచ్చిందన్నారు. మేం ఒకటే అడుగుతున్నాం. ఎందుకు ఈ కక్షసాధింపు ధోరణి చంద్రబాబు నాయుడుకి ఈ ప్రజల మీద కానీ,  ఈ ఉద్యోగస్ధుల మీద కానీ ఏర్పడింది.

దీనికి ఒక్కటే కారణం ఆయన ఓటమిని ఈనాటికీ కూడా జీర్ణించుకోలేకపోవడనేనన్నారు.  తనకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ప్రగతికి కానీ, అభివృద్ధికి కాని అడ్డుకట్టు వేసే ప్రయత్నం చేస్తున్నారని,  ఆ రోజు ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షనాయకుడిగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇదే విషయం చెప్పారన్నారు.

మీకు ఆ సభలో బలముంది కాబట్టి మీరు ఏ బిల్లులు పాస్‌ చేసినా ఇక్కడ మాకు బలముంది కాబట్టి ఆపేయడానికి సిద్ధమయ్యారే తప్ప, మంచీ, చెడు అందులో  ఉన్న సాంప్రదాయాలేంటి వీటినేవిధంగా గౌరవించాలని వీళ్లు ఆలోచించలేదన్నారు. దానివల్ల ఇవాళ ఇంత దారుణంగా ఉద్యోగులు జీతాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు.  తర్వాత అత్యవసరాలకు కూడా డబ్బులు ఖర్చుపెట్టలేని పరిస్ధితి రెండు, మూడు రోజులు ఏర్పడిందని, ఎందుకింత దిగజారిపోయిన రాజకీయం చేస్తున్నావు చంద్రబాబు అని ఆయన ప్రశ్నించారు.

ఈ  విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు చెప్పడానికే మీ ముందుకొచ్చామని స్పష్టంచేశారు. ఇవాళ చేసినదంతా చెప్పకపోతే తిరిగి జగన్మోహన్‌ రెడ్డి మీదే జీతాలివ్వలేదని ఆయన మీదే బురద జల్లి తనకు కావాల్సిన ప్రచారం చేసుకునేంత నేర్పరితనం చంద్రబాబుకు ఉందన్నారు. ఈ చంద్రబాబు రాజకీయానికి ప్రచారం ఒక గిఫ్ట్‌ అని ఏ రకమైన ప్రచారమైనా చేసుకుని తిమ్మిని బమ్మిని చేయగలరన్నారు.

కౌన్సిల్‌లో వారు అడ్డుకోవడం వలనే ఈ రోజున ఉద్యోగులకు జీతాలు కానీ అంగన్వాడీస్‌ లాంటి చిన్న, చిన్న కార్యకర్తల్లాంటి వారికి వేతనాలు, గౌరవ భృతి ఇవ్వలేని పరిస్ధితి ఏర్పడిందన్నారు. మీరు బిల్లుని అడ్డుకుని, ఇవాళ జీతాలు ఆలస్యం కావడానికి, అత్యవసర ఖర్చులు పెట్టడానికి వీలు కాకుండా చేసిందానికి మీరే కారణమన్నారు.  ఈ రాష్ట్ర ప్రజలకి, ఉద్యోగులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. 

నిజమే ఆ రోజు అమరావతి కోసమే, మా అవసరాల కోసమే రాజధాని షిప్ట్‌ అయిపోతే నష్టపోతామని ఆలోచించామే తప్ప ఈ  బిల్లును అడ్డుకుంటున్నామన్న ఆలోచన మాకు రాలేదన్న నిజాలను ప్రజలకు చెప్పాలన్నారు. లేదా ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకున్నారా అన్నదాన్నైనా చెప్పాలని టీడీపీ నేతలను ప్రశ్నించారు.

ఆ రోజు కేవలం ఒక హై డ్రామా క్రియేటే చేసి పూర్తిగా దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి బిల్లును పాస్‌ చేయకుండా వాయిదా వేసి వెళ్లిపోయిరన్నారు. మీరు చేసిన చర్యకి ఇవాళ ఈ రాష్ట్రం ఆర్ధికంగా నిలుపుదల లాంటి పరిస్ధితిలు వచ్చినందుకు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పి తీరాలని మంత్రి డిమాండ్‌ చేశారు.  ఇది మంచి పద్ధతి కాదని, ఇలాంటి సాంప్రదాయాలు సృష్టిస్తే భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశాలు ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా చేసిందానికి లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. మేం చేసిన తప్పు వల్లే ఉద్యోగులకుజీతాలు ఆలస్యం అయ్యాయి కాబట్టి మా రాజకీయ అవసరాలకి మేం చేసిన దానికి మమ్మల్ని క్షమించాలని టీడీపీ నేతలు ప్రజలని అడిగితే మీరు చెప్పిన ఫార్టీ ఇయర్స్‌ రాజకీయ అనుభవానికి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవానికి అర్ధముంటుందన్నారు.

లేదంటే మీ అనుభవం, మీ సీనియార్టీ ఎవరికి కావాలని ప్రజలు ప్రశ్నించడం ఖాయమని తేల్చి చెప్పారు. సీనియార్టీ ఉంటే సరిపోదని, నా అంత గొప్ప నాయకుడు లేడు, దేశంలోనే చక్రం తిప్పానని చెప్పుకుంటే సరిపోదని, ఇవాళ జీతాలు రాకుండా అడ్డుకున్న ఘనచరిత్ర కూడా మీకే మిగిలిందని తెలియజేస్తున్నానన్నారు. 

కొంతమంది జర్నలిస్ట్‌ సోదరులు అడుగుతున్నారు ఎలా పెన్షన్‌లిచ్చారని, అవును ఇది జగన్మోహన్‌ రెడ్డి కమిట్మెంట్, పేదల పట్ల ఆయనకున్న అభిమానానికి ఇది నిదర్శనమని,  నిన్ననే ప్రతిసారి, ప్రతినెల ఒకటో తారీఖునే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వారి చే తిలో పెన్షన్‌ డబ్బు పెట్టాలి, ఇంట్లో లేవలేని అశక్తతతో ఉన్న వృద్ధులకైనా నిద్రలేపి వారికి పెన్షన్‌ డబ్బులివ్వాలన్నది సీఎం వైయస్‌.జగన్‌  తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 

ఆ ప్రకారం  ఇవాళ ఇవ్వాలంటే రెండు రోజుల క్రితమే నగదుగా డ్రా చేసి ఆ నగదుని ఆయా జిల్లాలకు పంపించి, ఆ నగదుని వాలంటీర్లకు అందించాం కాబట్టి ఇవాళ అది జరిగిందని చెప్పారు.  కానీ జీతాలకు వచ్చేటప్పటికి ఆ విధంగా చేయడానికి లేదని, జీతాలు కచ్చితంగా ట్రాన్సెక్షన్‌ రూపంలో వెళ్లాల్సిందేనన్నారు.  నెల పూరై్తన తర్వాత ఇవ్వాల్సిన పరిస్థితులే, సో ఆ కారణంగానే ఇవాళ సమయానికి పెన్షన్‌లు ఇవ్వగలిగాం, జీతాలు ఇవ్వడానికి ఈ సాంకేతిక అంశాలన్నీ కూడా అడ్డు వచ్చిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఏదో మేం జగన్మోహన్‌ రెడ్డిని సాధిస్తున్నాం, ఈ ముఖ్యమంత్రికి అపఖ్యాతిని తీసుకొచ్చే కార్యక్రమాలను పక్కనబెట్టి ప్రజలకు చెడు చేయకుండా ఉండే ధోరణిలోనే ముందుకు వెళ్లాలన్నారు. 
మరోవైపు  ఈ రోజు మొట్టమొదటిసారిగా పొగాకు కొనుగోళ్లుని మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం స్టార్ట్‌ చేసిందని, ఇవాళ  ఒంగోలులో నో బిడ్‌ జరిగింది తెలిపారు.

మార్కెట్‌కు వచ్చిన ప్రతీ బేలు రైతులు విక్రయించుకోగలిగే పరిస్ధితి వచ్చిందంటే, అది ఈ మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ వలనే సాధ్యమైందన్నారు. మీడియం గ్రేడ్స్‌ నుంచి నో గ్రేడ్‌ వరకు ప్రతీ గేడ్స్‌ని కొనుగోలు చేయాలి, ఆ రేటును డిస్‌ప్లే చేయండి అని చెప్పి సీఎం సమీక్షా సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.   

మీరు ఏ రేటు చెపుతారో ఆ రేటు డిస్‌ప్లే చేయడంతో పాటు ఆ క్వాలిటీకి సంబంధించిన వివరాలు అన్నీ ఉండాలని,  రైతుని నష్టపరచకుండా పూర్తి పారదర్శకతతో వేలం జరగాలిన సీఎం అదేశించారన్నారు. అది ఏ విధంగా జరుగుతుందని సీఎం సమీక్షించారని,  దీంతో పాటు మార్కెట్‌ఇంటర్‌వెన్షన్‌ సంబంధించి కూడా ఏ విధంగా జరుగుతుందన్న విషయంపై కూడా సమీక్ష జరిగిందన్నారు. 

రైతు భరోసా కేంద్రాలన్నీ  కూడా భవిష్యత్తులో మార్కెటింగ్‌ కేంద్రాలుగా రూపుదిద్దడం కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు. రైతు ఫలానా ఉత్పత్తి మా దగ్గర ఉన్నదంటే దాన్ని విక్రయించడానికి ఆన్‌ లైన్‌ ప్లాట్‌ ఫాం ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించారని,  ఆ ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 

దాదాపు 11వేల జనతా బజార్‌లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిపై అధ్యయనం చేయాలన్న సిఎం గారి ఆదేశాల మేరకు అధ్యయనం జరుగుతుందన్నారు. ఈ 11 వేల జనతాబజార్లు భవిష్యత్తులో ప్రతిగ్రామ సచివాలయానికి అనుసంధానంగా రావాలని సీఎం స్పష్టం చేశారన్నారు.

రైతు ఏదైతే పంట పండిస్తారో ఆ పంట 30 శాతం మనం కొన్నా, మిగతా  70 శాతం ప్రభుత్వం నేరుగా కొనలేని   పంట కూడా బయట మార్కెట్‌లో కొనడానికి ఫెసిలిటేటర్‌గా మన ప్రభుత్వం పనిచేయాలి, దానికి పూర్తి మద్ధతివ్వాలని ఆదేశించారని, దీంతో పాటు గ్రేడింగ్‌ సెంటర్స్‌ , గోడౌన్స్, కోల్డ్‌ స్టోరేజీలు వీటన్నింటిని కూడా ఏర్పాటు చేయడానికి వచ్చే సంవత్సరం జూన్‌ నాటికల్లా వీటన్నింటిని కూడా సిద్ధం చేయాలని ఈ సమావేశంలో సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశించారన్నారు.

ఈ నేపధ్యంలో  పూర్తి స్ధాయిలో రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందిని చెప్పారు.  చివరికి చరిత్రలో లేని విధంగా పొగాకు కొనుగోలు కూడా ప్రారంభించిందని చెప్పారు.
మరోవైపు 104 గాని, 108 గాని ఆ వ్యవస్ధని చంద్రబాబునాయుడు గారి హయాంలో ఏ విధంగా మార్చాసారో అందరికీ తెలుసన్నారు.

ఇవాళ ఒకేసారి వందలాది వాహనాలు దాదాపు 1088 వాహనాలు 108,104 వాహనాలు ప్రారంభించి రాష్ట్రం నలుమూలలా పంపించిన పరిస్ధితి చూస్తే, ఒక ముఖ్యమంత్రికి ఉండే కమిట్‌మెంట్, ఒక నాయకుడికి పేదల పట్ల ఏ కమిట్‌మెంట్‌ ఉండాలో ఇవాళ కనిపించిందన్నారు. దీనిపై  దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. 

దేశవ్యాప్తంగా ఇవాళ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు తీసుకోవాలనే ప్రశంసలను ఇవాళ చూశామని మంత్రి తెలిపారు. ఆ వ్యవస్ధను ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెడితే తర్వాత వచ్చిన చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు.

ఇంకా చెప్పాలంటే ప్రాణాలు పోయిడానికి అవసరమైన 104,108 వాహనాలను మూలన పడేసి మహాప్రస్ధానం అని చనిపోయిన మృతదేహాలని రవాణా చేయడం కోసం కొత్త వాహనాలు కొన్న చరిత్ర చంద్రబాబునాయుడుని గుర్తు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల ఆలోచనల్లో ఎంత తేడా ఉంటుందో చెప్పడానికే తానీ విషయాన్ని ప్రస్తావించానన్నారు. ప్రాణాలు పోసే అంబులెన్స్‌లని ఈ ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తే... ప్రాణాలు పోయాక మృతదేహలను రవాణా చేయడానికి కొత్త వాహనాలను  ఏర్పాటు చేసిన చరిత్ర చంద్రబాబునాయుడుదన్నారు.

నెగిటివ్‌ ఆలోచలనుంచి బయటకు రావాలని, మంచి వైపు చూడాలని, ప్రజలకు జగన్మోహనే రెడ్డి చేస్తున్న మంచికి మోకాలడ్డే కార్యక్రమాలను మానేయండని సూచించారు. జగన్మోహన్‌ రెడ్డి మీ మీద అఖండ విజయం సాధించినందుకు కక్షసాధింపు అని మీరనుకుంటున్నారు కానీ  ఉద్యోగులకు జీతాలివ్వకుండా చేశారని టీడీపీ నేతలకు గుర్తు చేస్తున్నామన్నారు.