మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (16:32 IST)

ఆ ఎమ్మెల్యేల కంటే ముంబై రెడ్‌లైట్ ఏరియావాల్లే నయం : సీపీఐ నారాయణ

ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. మరో పార్టీలోకి వెళుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల కంటే రెడ్‌లైట్ ఏరియాల్లో పడుపు వృత్తి చేసుకునే మహిళలే నయమన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై నారాయణ స్పందిస్తూ, ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వల్లే తెలంగాణ రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని, అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. 
 
ముఖ్యంగా, పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల కంటే ముంబై రెడ్‌లైట్ ఏరియావాళ్లే నయం అంటూ విమర్శలు గుప్పించారు. తెరాసలో ఉంటేనే నిధులు ఇస్తామని ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులకు కేసీఆర్ చెబుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే ఇక ఎన్నికలు ఎందుకని నారాయణ ప్రశ్నించారు.