సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 6 మే 2021 (19:47 IST)

ఏపీలో ఆరు ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు

అమరావతి: ఏపీలో పలు ఆస్పత్రులపై అధికారులు మెరుపు దాడులు చేశారు. 30 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆరు ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. కడపలోని ఓ ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎక్కువ మంది రోగులను చేర్చుకోవడం, ఆరోగ్యశ్రీ చికిత్స నిరాకరణ, రెమ్‌డెసివిర్‌ దుర్వినియోగంపై చర్యలు చేపట్టారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్‌ షాపుల్లో రికార్డులు నిర్వహించకపోవడం వంటి అవకతవకలపైనా కేసులు నమోదు చేశారు.

ప్రకృతి వైఫరీత్యాల చట్టం, ఔషధ నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పిడుగురాళ్లలోని పల్నాడు ఆస్పత్రి, అంజిరెడ్డి ఆస్పత్రి, చిత్తూరులోని సుభాషిణి ఆస్పత్రి, విజయవాడలోని వేదాంత ఆస్పత్రి, శ్రీకాకుళంలోని సూర్యముఖి ఆస్పత్రి, కడపలోని సిటీ కేర్‌ ఆస్పత్రికి కొవిడ్‌ పేషెంట్లను చేర్చుకునే అనుమతిని రద్దు చేశారు.