శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 మే 2020 (21:39 IST)

తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం: పాఠశాల విద్యాశాఖ కమీషనర్

పదో తరగతి పబ్లిక్ పరీక్షల అనధికార షెడ్యూలును సామాజిక మాధ్యమాల్లో ప్రచారం  చేస్తున్నవారిపై క్రిమినల్ కేసులు పెడతామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇటీవల 15వ తేదీ నుంచి పరీక్షలంటూ ప్రచారం చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యేలా కొంతమంది వదంతులు సృష్టించారు.

ఈసారి వదంతులతో ఆగకుండా కమీషనర్ సంతకం ఫోర్జరీ చేసి, మే 18 నుంచి మే 25 వరకు పదో తరగతి పరీక్షలంటూ షెడ్యూలును వాట్సప్ లో విస్తృత ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ కమీషనర్ తెలిపారు.

నిందితులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావొద్దని విద్యాశాఖ కమీషనర్ కోరారు.