శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (20:01 IST)

తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ళు

తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఫేస్ బుక్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి దిగుతున్నారు.

పోలీసుల పేరుతో ఫేక్ అకౌంట్ లను క్రియేట్ చేసి ఆ ఎకౌంట్ల ద్వారా డబ్బు కావాలంటూ మెసేజ్ లు పెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. ఒక్క తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు 50మంది పోలీసు అధికారుల పేర్లతో సైబర్ నేరగాళ్ళు ఫేక్ అకౌంట్స్ తెరిచారని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు అధికారులు .
 
సోషల్ మీడియా టార్గెట్ గా సైబర్ నేరగాళ్ళు
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సోషల్ మీడియాని టార్గెట్ చేసుకున్నారు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం, అధికారుల ఫోటోలు, పేర్లు ఉపయోగించుకోవడం, కొత్త ఖాతాలు తెరవడం చేసి వీటి ఆధారంగా పబ్లిక్ తో చాటింగ్ చేస్తున్నారు.

ఇదంతా నిజమని నమ్ముతున్న పబ్లిక్ నిజంగానే తాము సదరు అధికారులతోనే మాట్లాడుతున్నట్లుగా ఫీలవుతూ, వారు ఏదడిగినా చేస్తున్నారు. దీంతో డబ్బు కావాలని రిక్వెస్ట్ పెడుతూ, తమ అకౌంట్లకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు సదరు కేటుగాళ్లు. పోలీసులకు ఇప్పుడు ఈ తరహా నేరాలు తలనొప్పిగా మారాయి.
 
పోలీసుల పేరుతో మనీ రిక్వెస్ట్ లు .. మోసపోతున్న జనాలు
తమ పేరుతో ఫేక్ అకౌంట్లు వినియోగిస్తూ డబ్బులు దండుకోవడం పోలీసులను టెన్షన్ పెడుతుంది. ఇప్పటికే హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లలో ఉన్న అధికారులతో పాటు డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేరుతోనూ నకిలీ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లు దందా మొదలుపెట్టారు.

ఈ మోసాలను గుర్తించని కొందరు వారు అడిగినంత డబ్బులు ఇస్తుంటే, అనుమానం వచ్చిన వారు పోలీసుల దృష్టికి తీసుకు వెళ్తున్నారు. దీంతో దృష్టిసారించిన సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ క్రైమ్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.