యూనిస్ తుఫానుతో వణికిపోతున్న యూరప్.. మనుషులే ఎగిరిపోతున్నారు
యూరప్ దేశాలు యూనిస్ తుఫాను వణికిస్తోంది. ఈ తుఫాను కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా ఆస్తి నష్టం ఏర్పడింది. భీకరగాలులతో యూరప్ దేశాలు వణికిపోతున్నాయి.
శుక్రవారం కొన్నిచోట్ల గంటకు 196 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ గాలులకు మనుషులే ఎగిరిపోతున్నారు.
ఇక విమానాలు, రైళ్లు, ఫెర్రీల రాకపోకలకు అంతరాయం కలుగుతుంటే... పశ్చిమ యూరప్‌లో లక్షల మంది ప్రయాణికులు తాత్కాలిక షెల్టర్లలో ఉండాల్సి వస్తోంది.
అట్లాంటిక్ మహా సముద్రంపై ఈ తుఫాను పుట్టింది. ఇది వాయవ్య యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. నిన్న ఒక్క రోజే 8 మంది చనిపోయారు.
ఈసారి వచ్చిన యూనిస్ తుఫాను అత్యంత భయంకరమైనది, ప్రాణాంతకమైనదని బ్రిటన్ లోని వాతావరణ ఆఫీస్ తెలిపింది. ఈ తుఫాను వల్ల విమానాలు సైతం రన్‌వేపై ఊగిపోతున్నాయి.
బ్రిటన్ ఎయిర్ పోర్టుల్లో విమానాలు దిగకుండా దారిమళ్లిస్తున్నారు. లండన్‌లోని హీత్రో ఎయిర్ పోర్టులో ఏకంగా లైవ్ స్ట్రీమ్ పెట్టేశారు. దాన్ని 2 లక్షల మందికి పైగా చూస్తున్నారు. బ్రిటన్ లో 436 విమానాల సర్వీసులను రద్దు చేశారు