శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (12:59 IST)

బాపట్లకు అతి సమీపంలో మిచౌంగ్ తుఫాన్, ఏపీ జిల్లాల్లో భారీ వర్షాలు

cyclone
మిచౌంగ్ తుఫాన్ మంగళవారం ఉదయానికి బాపట్ల సూర్యలంకకి అతి సమీపంలో వుంది. తుపాను ప్రస్తుతం బాపట్లకి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వున్నట్లు విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపారు.

కాగా ఈ తుఫాన్ సముద్రంలో వున్నప్పుడు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగగా ఇప్పుడు అది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. తుఫాను ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా తెలంగాణలోనూ అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.