సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (14:54 IST)

విశాఖ ఉక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకం : పురంధేశ్వరి

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని బీజేపీ ఏపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 
 
రాజీనామాలపై స్పందించనని, తమ పార్టీ స్టాండ్ తమకు ఉంటుందన్నారు. ఈనెల 14వ తేదీన ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. బీజేపీకి ఎటువంటి రాజకీయ లబ్ధి ఉండదని, జాతి ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. 
 
ఈ ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టింది అసాధారణమైన బడ్జెట్ అని కొనియాడారు. పెట్రోల్‌పై టాక్స్‌లను రాష్ట్ర ప్రభుత్వమే తగ్గించుకోవాలన్నారు. ఆరోగ్యం, మానవ వనరులతో పాటు ఆరు అంశాలను గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఏపీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటుందని, నిధులు ఇస్తుందని పురంధేశ్వరి అన్నారు.