బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (11:12 IST)

కన్నతండ్రి కాదు.. కామాంధుడు.. ల్యాప్‌టాప్‌లో కుమార్తె ఫోటోలు..

వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. కామాంధుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. కాపాడాల్సిన వారే కామాంధులుగా మారిపోతున్నారు. తాజాగా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురి విషయంలో నీచంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. కూతురి నగ్న ఫోటోలను తన ల్యాప్‌టాప్‌లో పెట్టుకుని పైశాచిక ఆనందం పొందుతూ వచ్చాడు. హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. తన భార్యకు తెలియకుండా కూతురి నగ్న ఫోటోలను చిత్రీకరించాడు. వాటిని తన ల్యాప్ టాప్‌లో సేవ్ చేసి పెట్టుకున్నాడు. కానీ తండ్రి తీరుపై కుమార్తెకు అనుమానం వచ్చింది. అంతటితో ఆగకుండా అతడి ల్యాప్ టాప్ తీసి చూడటంతో.. తన ఫోటోలు అభ్యంతరకరంగా వుండటాన్ని చూసి షాకైంది. 
 
తండ్రి ల్యాప్ టాప్‌లో ఈ రకమైన ఫోటోలు ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. ఈ విషయం గురించి తల్లికి చెప్పిన బాధితురాలు.. ఆమె సాయంతో తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కొద్ది రోజుల తర్వాత నిందితుడికి కరోనా సోకడంతో మందలించి వదలిపెట్టిన పోలీసులు.. అతడు కరోనా నుంచి కోలుకోవడంతో అరెస్ట్ చేశారు.