మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (13:54 IST)

తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటేనే జగన్‌కు 986 మందితో సెక్యూరిటీనా?

devineni
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు మరోమారు విమర్శలు గుప్పించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటేనే జగన్ తన ఇంటి చుట్టూత 986 మంది పోలీసులతో భద్రతను పెట్టుకోవడం ఓ వింతగా ఉందన్నారు. అందుకే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను మించిన నియంత అని ఆయన ఆరోపించారు. ఇంట్లో ఉంటేనే అంత మంది పోలీసులను భద్రతగా పెట్టుకుంటే ఇక బయటకు వెళితే అంతకు మూడు రెట్లు భద్రత పెట్టుకునేవారని గుర్తించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జగన్ తన రాజభవనాల రక్షణ కోసం ఏకంగా ప్రత్యేక చట్టమే చేశాడంటూ విమర్శించారు. సొంత ప్యాలెస్‌ల రక్షణ కోసం ఏకంగా వందల కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారని తెలిపారు. ఆయన ఇంట్లో ఉన్నపుడు ఏకంగా 986 మంది సెక్యూరిటీ పెట్టుకున్నాడని, బయటకు అడుగుపెడితే దానికి మూడు రెట్లు అధికంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపించారు. దారిపొడవునా పరదాలు కట్టి, అడుగుకో పోలీస్‌‍ను కాపలాగా నిలబెట్టి రాష్ట్రంలో పర్యటించే వారని గుర్తు చేశారు. 
 
తన కుటుంబం, తన రాజభవనాల రక్షణ కోసం ఏకంగా ప్రత్యేక చట్టం చేయడంతో పాటు తన నివాస పరిసరాల్లో 48 చెక్‍ పోస్టులు, రిక్టాట్రబుల్ గేట్లు, బూమ్ బారియర్లు, టైర్ కిల్లర్లు, బోలార్డ్స్ లాంటి విస్తు గొలిపే అనవసర చర్యలు తీసుకున్నారన్నారు. తన తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో జరిగిన అత్యాచారం, అరాచకాలను మాత్రం జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల భద్రతను గాలికొదిలేసి ప్రజల సొమ్ముతో తన విలాసాలు అనుభవించే జగన్ ఒక బడా పెత్తందారు కాక మరేమిటి అని దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు.