సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (15:38 IST)

అధ్యక్షా... 101 దేశాల్లో ఎగువ సభలు లేవు... మరి ఏపీలో ఎందుకు? : ధర్మాన

ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చలోభాగంగా, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రపంచంలో 101 దేశాల్లో పెద్దల సభలు లేవని గుర్తుచేశారు. అలాంటపుడు మన రాష్ట్రంలో శాసనమండలి ఎందుకు అధ్యక్షా అంటూ అడిగారు. ఈ పెద్దల సభ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రజలు తిరస్కరించిన వ్యక్తులు ఈ సభలో చేరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. 67 దేశాల్లో మాత్రమే ఎగువ సభలు ఉన్నాయని, 101 దేశాల్లో పెద్దల సభలు లేవన్నారు. బ్రిటీషర్ల ప్రోత్సాహంతోనే ఈ సభలు ఏర్పాటయ్యాయని చెప్పుకొచ్చారు. 
 
పెద్దలను గౌరవిస్తున్నామన్న పేరుతో దేశానికి కన్నంపెట్టే పనిచేశారని విమర్శించారు. బ్రిటీష్‌ వాళ్ల వైఖరిని మహాత్మాగాంధీ తీవ్రంగా తప్పుపట్టారని ధర్మాన చెప్పారు. ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలని ఆనాడే విమర్శలు వచ్చాయని, ఇలాంటి అభివృద్ధి నిరోధక వ్యవస్థ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. శాసనమండలి లేని రాష్ట్రాల్లో కొంపలు మునగడం లేదని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.