సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:52 IST)

సావిత్రమ్మ ఆశయసాధనకు కృషి చేస్తాం: ధర్మాన కృష్ణదాస్

పేదల పెన్నిధి, అభ్యుదయ మహిళా రైతు, కుటుంబ విలువలకు నిలువెత్తు రూపం అయిన తన తల్లి  ధర్మాన సావిత్రమ్మ ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తామ‌ని ధ‌ర్మాన సోద‌రులు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద రావులు త‌మ త‌ల్లి స్వర్గీయ సావిత్రమ్మ 9వ వర్ధంతి సందర్భంగా మబుగాం గ్రామంలో ఆమె స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ధర్మాన సోదరులు తమ కుటుంబంతో కలిసి పూజ‌లు చేశారు. 
 
ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ, తన మాతృమూర్తి ఆశయాలు తీర్చి తల్లి ఋణం తీర్చుకొంటామని చెప్పారు. తమ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు దక్కిందంటే దానికి తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పిన విలువలే కారణమని చెప్పారు. ఈ  కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన రామదాసు, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఇతర కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.