మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 18 నవంబరు 2020 (16:36 IST)

జగన్ సర్కార్ కొత్త ఎత్తు: ఏపీలో డిసెంబరు 25న ఇళ్ల స్థలాలు పంపిణీ

ఏపీలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలు మెప్పును పొందుతున్న వైస్ జగన్ ప్రస్తుతం మరో పథకాన్ని అమలు పరచనున్నారు. పేదప్రజలకు ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తానని తన హామీలో పేర్కొన్నారు. కానీ వీటిపై కోర్టులో స్టేతో వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీకి జగన్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఎత్తు వేసింది.
 
డిసెంబరు 25న రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కోర్టు స్టేలు లేని ప్రాంతాలలో డి-ఫామ్ పట్టాతో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు అదే రోజు ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇళ్ల స్థలాల పంపిణీకి ఇప్పటివరకు 30 లక్షల 68 వేల 281 లబబ్దిదారులను గుర్తించిన ప్రభుత్వం ఇందులో భాగంగా మొదటిసారిగా 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.