బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 మే 2020 (08:53 IST)

వలస కూలీలకు చెప్పుల పంపిణీ

పొట్టకూటి కోసం కుటుంబాలు, పిల్లాజల్లాతో కలిసి జిల్లాలు, రాష్ట్రాలను దాటుకుంటూ మన రాష్ట్రానికి బ్రతుకు దెరువు కోసం వచ్చిన వలస కూలీలపై దాతృత్వం చూపి, వారికి చేతనైన సహాయం చేసి ఆహారం, త్రాగునీరు అందించి వారి గమ్యం చేరేందుకు మనవంతు కృషి చేయాలని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పిలుపునిచ్చారు.

దానిలో భాగంగా మంగళవారం తిరువూరు అంతరాష్ట్ర తెలంగాణా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద గుంటూరు నుండి, లక్నో, ఉత్తరప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు మండే ఎండలో కాలి నడకన నడుచుకుంటూ వెళుతున్న 50 మంది వలస కూలీలకు నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు, మైలవరం సిఐ పి. శ్రీను తో కలసి దాతల సహకారంతో సమకూర్చి, చెప్పులను వారికి అందచేశారు.

అలుపెరగని వారి ప్రయాణానికి మార్గమధ్యలో చెప్పులు ఎంతగానో సహాయ పడతాయని డిఎస్పీ తెలిపారు.