సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 27 నవంబరు 2021 (12:52 IST)

దివిసీమలో భగ్గుమన్న పాత కక్షలు...వ్య‌క్తిపై దారికాచి దాడి

దివిసీమ‌లో మ‌రో సారి పాత క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి. కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన రేపల్లె ప్రతాప్ అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అవనిగడ్డ నుంచి వి. కొత్తపాలెం తన ఇంటికి వెళ్తుండగా, దారికాచి కత్తులతో తనపై దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు.

 
పాత కక్షల నేపథ్యంలో రేపల్లె రాము, ఎలవర్తి మల్లికార్జునరావు మరి కొంతమంది కలిసి తనపై దాడి చేసినట్లు బాధితుడు  తెలిపాడు. 2014లో వి. కొత్తపాలెం గ్రామంలో జరిగిన హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న రేపల్లె ప్రతాప్ పై ఈ దాడి జ‌రిగింది. తీవ్ర గాయాలతో అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో ప్రతాప్ చికిత్స పొందుతున్నాడు. దాడి జరిగిన సంఘటనపై వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామ‌ని అవనిగడ్డ సి.ఐ  రవికుమార్. తెలిపారు.