శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (17:15 IST)

నటి షాలూ చౌరాసియాపై దాడి చేసినవాడు సినిమావాడే... పట్టేసారు

టాలీవుడ్ నటి షాలూ చౌరాసియాపై దాడి చేసినవాడు సినిమా షూటింగుల్లో లైట్ బోయ్‌గా పనిచేసేవాడని తేలింది. చౌరాసియాపై దాడి చేయడమే కాకుండా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు ఆమె ఫోనుని లాక్కొని తన గదికి తీసుకుని వెళ్లి దాచి పెట్టాడు. తొలుత అతడిని గుర్తించడంలో కాస్త ఇబ్బందిపడ్డ పోలీసులు ఆ తర్వాత సీసీ కెమేరా సాయంతోనే నిందితుడిని గుర్తించారు.

 
కాగా ఇతడిపై గతంలోనూ పలు కేసులు వున్నట్లు పోలీసులు చెపుతున్నారు. గోల్కొండలో నమోదైన ఓ కేసులో జైలుకి కూడా వెళ్లొచ్చినట్లు చెపుతున్నారు. ఐనా ఇతడు బుద్ది మారలేదని పేర్కొన్నారు. ఇంకా విజయవాడ, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో కూడా అతడిపై కేసులున్నాయి.