పెద్దపల్లిలో 2 రోజుల్లో 12 శునకాలు మృతి- కుక్కలకు కూడా కరోనా?
జంతువులను కూడా కరోనా వేధిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే ప్రపంచ ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. జంతువులు కూడా ఈ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాయి. న్యూయార్క్‌లో మొన్నటికి మొన్న ఓ పెద్ద పులికి కరోనా వచ్చిందని తెలియడంతో ప్రపంచంలోని జూలాజికల్ పార్కుల్లో సిబ్బంది అప్రమత్తమై.. అనేక రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు. తాజాగా శునకాలకు కూడా కరోనా వస్తోందా అంటూ వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలోని మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో వీధి కుక్కలు సైతం వింత వ్యాధులతో చనిపోతున్నాయి.. రెండ్రోజుల్లో 12 కుక్కలు మృత్యువాత పడ్డాయి. ఇదే ఇప్పుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
పులికి కరోనా వ్యాధి వచ్చిందంటున్న తరుణంలోనే.. కుక్కలు చనిపోవడం చూస్తుంటే.. ఈ కుక్కలకు కరోనా వైరస్ వ్యాపించిందేమోననే టెన్షన్‌తో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే వైద్యులు మాత్రం..పోస్టుమార్టం చేసి ఏ కారణం చేత చనిపోయాయో చెబుతామంటున్నారు.