అంటువ్యాధులపై పోరాటం.. వైఎస్ వివేకా కుమార్తెకు ఐడీఎస్ఏ ఫెలోషిప్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతను ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. ఐడీఎస్ఏ ప్రెసిడెంట్ స్టీవెన్ కె. స్మిత్ ఈ ప్రకటన చేశారు.
సునీత అంకితభావం, నైపుణ్యం, నాయకత్వం, రోగుల సంరక్షణ పట్ల నిబద్ధత తమ సంస్థకు అత్యంత ప్రయోజనకరంగా ఉన్నాయని ప్రశంసించారు.
మానవాళిని గణనీయంగా ప్రభావితం చేసే అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో, బాధిత రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించడం ద్వారా తన బాధ్యతలను పెంపొందించడంలో తన పాత్రను గుర్తించడంపై డాక్టర్ సునీత హర్షం వ్యక్తం చేశారు.
సునీత సాధించిన విజయం పట్ల అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంటు వ్యాధులపై సునీత అవిశ్రాంత పోరాటాన్ని కొనియాడారు.