సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (11:40 IST)

శ్రీకాళహస్తి ఆలయంపై డ్రోన్.. ఐదుగురు యువకులు అరెస్ట్

Kalahasti
శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. డ్రోన్ కెమెరాలతో తమిళనాడు చెందిన ఐదుగురు యువకులు వీడియోల చిత్రీకరించినట్టు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. 
 
శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ.. డ్రోన్ ఎగరవేస్తున్న వాళ్ళని గుర్తించి పోలీసులకు అప్పగించింది. చెన్నైకి చెందిన విఘ్నేష్, అజిత్, కన్నన్, శంకర్ శర్మ, అరవింద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆలయంపై డ్రోన్ ఎగరడంపై భక్తులు ఆందోళన చెందారు.
 
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కావడంతో ఆలయ పరిసరాలకు విద్యుత్‌ దీపాలంకరణ చేశారు. వీటిన్నింటినీ చిత్రీకరించాలని ఆ యువకులు భావించారు. తాముంటున్న గెస్ట్‌హౌస్‌ పైనుంచి డ్రోన్‌ కెమెరాతో అర్ధరాత్రి ప్రధాన ఆలయంలో చిత్రీకరించారని పోలీసులు తెలిపారు.