శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (12:27 IST)

అనంతపురంలో డ్రగ్స్ కలకలం - రైల్వేస్టేషన్‌లో భారీగా..

drugs
అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. ఈ జిల్లాలోని గుంతకల్ రైల్వే స్టేషన్‌ పార్శిల్ ఆఫీసులో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ మీదుగా తరసిస్తున్న కొకైన్‌ను స్థానిక పోలీసులు నిఘావేసి మరీ పట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌లో పార్శిల్ కార్యాలయంలో వద్ద డ్రగ్స్ పంచుతున్నట్టు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
 
దీనికి సంబంధించి విజయవాడకు చెందిన పఠాన్ ఫిరోజ్ ఖాన్, గోవాకు చెందిన కరణ్ షిండే, ఆకాష్ గంగూలీ అనే ముగ్గురు డ్రగ్స్ ఫెడ్లరను అరెస్టు చేశారు. గోవాకే చెందిన కృష్ణ, రోనాల్డ్ అనే ఇద్దరు నిందితులు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. దీనిపై గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప నేతృత్వంలోని పోలీస్ బృందం విచారణ జరుపుతుంది.