ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (16:55 IST)

చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి, 30మందికి గాయాలు

road accident
చిత్తూరు జిల్లాలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలను బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 
 
రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 
బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్తుంగా మొగిలి ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిని వారిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.