బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 మార్చి 2019 (14:07 IST)

జనసేనలోకి జేడీతో తోడల్లుడు కూడా... మా ఇద్దరి ఆలోచనలు ఒకటే... లక్ష్మీనారాయణ

పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేరారు. ఆయనతో పాటు ఆయన తోడల్లుడు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి రాజగోపాల్ కూడా జనసేన పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. ఆదివారం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఇద్దరిని పవన్ కళ్యాణ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమందిలో జ్ఞానం ఉంటుంది. మరికొంతమందిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటాయి. ఇంకొదరిలో జనాదరణ ఉంటుంది. ఈ మూడు లక్షణాలు చాలా కొద్ది మందిలో అరుదుగా ఉంటాయి. అటువంటివారే సమాజంలో మార్పు తీసుకురాగలరు. ఈ మూడు లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ప్రజల జీవిత్లాలో మార్పు తీసుకురావాలి. సమసమాజాన్ని నిర్మించాలి. ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని స్థాపించాలన్న ఉద్దేశ్యంతో 2014లో పవన్ కళ్యాణ్‌తో చర్చించాను. అయితే, కుటుంబ బాధ్యతల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం నేను ముందుకు వెళ్తున్నాను. మళ్లీ ఒక రోజు కలిసి పనిచేద్దామని చెప్పారు. ఆ రోజు ఈ రోజు అయినందుకు ఆనందంగా ఉందన్నారు.
 
ఇద్దిరి ఆలోచనలు ఒకటి కావడంతో ఒకరంటే ఒకరికి అభిమానం. యువతరం బాగుండాలి. మహిళా సాధికారిత సాధించాలి. అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలన్నది ఆయన కోరిక. భారతదేశం యువతరంతో నిండిపోయింది. ఈ యువతరానికి వచ్చే ఐదేళ్ళలో మంచి మార్గం నిర్దేశం చేసి వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచగలిగితే భారతదేశం ప్రపంచ దేశాల్లో గొప్పదేశంగా మారే అవకాశం ఉంది. దానికి కావాల్సిన వారి చేతులు పట్టుకుని ముందుకు తీసుకెళ్లే వ్యక్తికావాలి. ఆ వ్యక్తి పవన్ రూపంలో కనిపించారు. ఒకటి ఒకటి కలిపితే రెండు.. పవన్ నేనూ కలిస్తే పదకొండు. ఈ పదకొండుతో ఏపీలో మంచిపాలన తీసుకొస్తాం. పవన్ నాయకత్వంలో ముందుకు నడుస్తూ వారు మా మీద పెట్టుకున్న ఆశలన్నింటిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తాం అని లక్ష్మీనారాయణ ప్రకటించారు.