ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (15:40 IST)

వైసీపీకి షాకిచ్చిన బాలినేని శ్రీనివాస రెడ్డి

balineni srinivasa reddy
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తన పదవులకు రాజీనామా చేశారు. తద్వారా వైకాపా షాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీకి చిత్తూరు, తిరుప‌తి, నెల్లూరు జిల్లాల రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్‌గా వున్న బాలినేని తన పదవులకు రాజీనామా చేశారు. 
 
పని ఒత్తిడి కారణంగా తన నియోజకవర్గంలో తగిన సమయాన్ని కేటాయించడం లేదనే ఉద్దేశంతో ఆ పదవి నుంచి తప్పుకున్నట్లు బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్తున్నా.. గత కొంత కాలంగా పార్టీలో జరుగదుతున్న పరిణామాల కారణంగా ఆయన రాజీనామా చేసి వుంటారని టాక్ వస్తోంది. 
 
ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో బాలినేనికి తీవ్ర అవ‌మానం జరిగంది. అలాగే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించిన‌ప్ప‌టి నుండి బాలినేని అసంతృప్తిలో ఉన్నారు. ఇందుకే ఆయన తన పదవులకు రాజీనామా చేసి వుంటారని వార్తలు వస్తున్నాయి.