సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జులై 2020 (12:05 IST)

దళితులలో పెయిడ్ బ్యాచ్‌కు సవాల్.. మీకు సిగ్గుంటే... ఇదే కులంలో పుట్టివుంటే...

తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన ఘటనపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వైకాపా ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. అలాగే, బహిరంగంగా ఓ ఛాలెంజ్ విసిరారు. 
 
పోలీసుల చేతిలో బాధిత శిరోమండన యువకుడిని ఆయన స్వయంగా పరామర్శించారు. ఈసందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ, పోలీసు స్టేషన్‌లో దళిత యువకుడికి శిరోముండనం చేయడం దారుణం. 24 గంటలు టైం ఇస్తున్నాను. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, జైలుకు పంపించాలి. ఎస్‌ఐను సస్పెండ్‌ చేస్తే సరిపోదు. సీఐ, డీఎస్పీ, ఎస్పీలను కూడా సస్పెండ్‌ చేయాలి’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. 
 
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఓ పథకం ప్రకారం దళితులపై దాడులు చేస్తున్నారు. అసలు దళిత ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉందా? ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, మంత్రులు ఉన్నారు. దళితులలో పెయిడ్‌ బ్యాచ్‌కు సవాల్‌ చేస్తున్నాను. మీకు సిగ్గు ఉంటే, ఇదే కులంలో పుట్టి ఉంటే ఖండించండి. పార్టీ ముసుగులు వదలండి. స్పందించండని పిలుపునిచ్చారు.