ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మే 2022 (17:21 IST)

పరీక్షలు రాస్తుండిన విద్యార్థినిపై ఫ్యాన్ పడితే..?

fan
fan
పరీక్షలు రాస్తుండిన విద్యార్థినికి షాక్ తగిలింది. ఏపీలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినీ మీద ప్రమాదవశాత్తు ఫ్యాన్ కుప్పకూలింది. దాంతో విద్యార్థినీకి గాయాలయ్యాయి.
 
వివరాల్లోకెళ్తే.. సత్యసాయి జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో సోమవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినిపై ప్రమాదవశాత్తు ఫ్యాన్ కుప్పకూలింది.
 
దాంతో విద్యార్థినీ మొహానికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అనంతరం విద్యార్థిని యథావిధిగా పరీక్షలు రాసింది.
 
ఈ ఘటన దురదృష్టకరమని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు.