శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 10 జులై 2021 (23:13 IST)

ఫేర్వెల్ పెరేడ్‌తో కృష్ణా ఎస్పీకి ఆత్మీయ వీడ్కోలు!

కృష్ణా జిల్లా ఎస్పీగా ఎం. ర‌వీంద్ర‌ బాబు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయ‌నకు తూర్పుగోదావ‌రి జిల్లాకు బ‌దిలీ కావ‌డంతో పోలీస్ సిబ్బంది ఆత్మీయంగా వీడ్కోలు ప‌లికారు. మచిలీపట్నం పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్లో ఫేర్వెల్ ప‌రేడ్ నిర్వ‌హించారు. అడిషనల్ ఎస్పీ మలిక గర్గ్ , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందల్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ర‌వీంద్ర‌బాబు మాట్లాడుతూ, ఈ రెండు సంవత్సరాల కాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సిబ్బంది అందించిన సహకారం అభినందనీయమ‌న్నారు. కరోనా వైరస్ సమయంలో లా అండ్ ఆర్డర్ సిబ్బంది కన్నా, ఆర్మ‌డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, అను నిత్యం రహదారులపై ఉండి శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రధాన భూమిక పోషించారని కొనియాడారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఎంతో మంది సిబ్బంది వైరస్ బారినపడి కోలుకున్న, కొంతమందిని కోల్పోయామని, వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర, పట్టణ డీఎస్పీలు మాసుం భాష, రాజీవ్ కుమార్ , భరత్ మాతాజి, మోజెస్ పాల్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమణ, సి ఐ-2 శ్రీనివాసరావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, పట్టణ సిఐలు అంకబాబు, భీమరాజు, రమేష్, కొండయ్య, సన్యాసి నాయుడు, రామకృష్ణ, ఆర్.ఐ. లు శ్రీనివాస రావు, చంద్రశేఖర్, విజయసారథి, వెంకట్రావు, ఎస్సైలు ఆర్ ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.