శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (11:57 IST)

డెలావర్‌ ఎపుడూ నా గుండెల్లోనే ఉంటుంది.. జో బైడెన్

అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన తన సొంత పట్టణమైన డెలావర్‌ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో బైడెన్ వీడ్కోలు సభను స్థానికులు నిర్వహించారు. 
 
ఇందులో పాల్గొన్న బైడెన్ మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. బైడెన్ ఉద్వేగభరిత సందేశం ఇచ్చారు. "నా చివరి శ్వాస వరకు డెలావర్ ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది. నేను ఇక్కడ లేకపోవడం నన్ను బాధిస్తున్న.. మీరు నన్ను ఇక్కడి నుంచి ప్రెసిడెంట్ చేసి పంపుతున్నందుకు చాలా సంతోషంగా" ఉందన్నారు. 
 
కాగా, బుధవారం రాత్రి 10.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. బైడెన్ కంటే ముందు ఉపాధ్యక్షురాలు కమలదేవి హ్యారిస్ ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత బైడెన్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.