శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 4 మార్చి 2021 (20:07 IST)

వధువు అప్పగింతల సమయం... కానీ కరోనా కాటుతో మృతి

ప్రేమ వివాహం. ఇరు కుటుంబాలు అంగీకరించాయి. అట్టహాసంగా పెళ్లి జరిగింది. మార్చి 1న అంగరంగ వైభవంగా వివాహం చేసారు. పెళ్లి వేడుక ముగియగానే వధూవరులిద్దరూ కుర్చీల్లో ఆశీనులై వున్నారు. ఫోటోలు తీస్తున్నారు. వధువు తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. ఇంతలో ఏమైందో వధువు కళ్లు తిరిగి దబ్ మంటూ కిందపడిపోయింది. అపస్మారకంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి తేరుకుంది. అలా రెండు రోజులు గడిచింది.
 
ఎందుకయినా మంచిదని వధువును ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా ఆమె మరణించింది. ఆమెకి కరోనా పరీక్ష చేయగా ఆమె మరణించిన తరువాత కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో కోవిడ్ -19 యొక్క మార్గదర్శకాల ప్రకారం ఆమెను దహనం చేశారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలోని గోత్రి ప్రాంతంలోని కృష్ణ టౌన్‌షిప్‌లో వధువుకి అదే టౌన్‌షిప్‌లో వుంటున్న వరుడితో వివాహం అయ్యింది. మార్చి 1న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. వేడుక తరువాత వధువుకు జ్వరం వచ్చి రెండు రోజుల పాటు కుటుంబ వైద్యుడి నుంచి మందు తీసుకున్నారు. గురువారం వరుడి ఇంట్లో అప్పగింతల కార్యక్రమం నిర్వహించేదుకు మూహూర్తం నిర్ణయించారు. గురువారం ఉదయం ఆమె అప్పగింతల కార్యక్రమం కుటుంబ సభ్యుల మధ్య ఆనందకర వాతావరణంలో జరిగింది.
 
అందరూ అక్కడే ఉన్నారు. వధువు కూడా తన కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. కాకపోతే జ్వరం కారణంగా ఆమె బలహీనంగా ఉంది, కానీ తన భర్తతో ఇంటికి వెళ్ళే ఉత్సాహం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.
వధువుకు వీడ్కోలు పలకడానికి కుటుంబం మొత్తం ఉత్సాహంగా ఉంది, కానీ అకస్మాత్తుగా ఆమె అక్కడికక్కడే మూర్ఛపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా ఆమె మరణించింది.ఈ వార్త వినగానే కుటుంబం షాక్ అయ్యింది.
 
 ఆసుపత్రి మార్గదర్శకాల ప్రకారం వధువుకి కరోనా పరీక్షను నిర్వహించింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో ఆమె మృతదేహాన్ని కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం దహన సంస్కారాల కోసం కుటుంబానికి అప్పగించారు. అప్పటివరకూ తమ మధ్య నవ్వుతూ, తుళ్లుతూ వున్న వధువును కరోనా పొట్టనబెట్టుకోవడంపై ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించారు.