పెళ్లయిన 15 రోజులకే పారిపోయిన భర్త... తర్వాత ఏం జరిగింది?
తెలంగాణ రాష్ట్రంలోని నల్లొండ జిల్లాలో వ్యక్తి పెళ్లి చేసుకుని కేవలం 15 రోజుల్లో భర్తను వదిలిపెట్టి పారిపోయాడు. దీంతో దిక్కుతోచని ఆ వధువు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి న్యాయం చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నకిరేకల్‌కు చెందిన బిందుశ్రీకి హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేశ్‌తో గత ఏడాది వివాహమైంది. తర్వాత 15 రోజులకు సురేశ్ ఆస్ట్రేలియా వెళ్లాడు. మళ్లీ వచ్చి భార్యను తీసుకువెళ్తానని నమ్మించాడు. కానీ, ఆరు నెలలు గడిచినా తిరిగి రాలేదు. దీంతో బిందుశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడి పాస్‌పోర్టు సీజ్ చేసేలా పాస్‌పోర్టు అధికారులకు, భారత, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయాలకు సీఐ రాజశేఖర్ ఈ-మెయిల్స్ పంపారు. దీంతో కంపెనీ సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ నెల 2న నిందితుడు భారత్ వస్తున్నాడని తెలుసుకొన్న సీఐ.. ఢిల్లీ వెళ్లారు. ఇమిగ్రేషన్, ఎయిర్‌పోర్టు అధికారుల సహకారంతో సురేశ్‌ను అరెస్టుచేసి తీసుకొచ్చిబాధితురాలికి న్యాయం చేశారు.