బుధవారం, 29 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (22:54 IST)

వజ్రం దొరికింది.. కానీ రైతు చిక్కుల్లో పడ్డాడు..

Diamond
పొలంలో వజ్రం దొరకడంతో ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన ఎక్కడో కాదు.. అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కానీ ఆ వజ్రం అమ్మడంతో చిక్కుల్లో పడ్డాడు. తొలకరి వానల తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట మొదలైంది. 
 
తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం.. తనకు దొరికిన వజ్రాన్ని వ్యాపారికి అమ్మి చిక్కుల్లో పడ్డాడు. వజ్రాన్ని కొనుగోలు చేసి వ్యాపారి రైతుకు చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించారని.. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆర్డీవో, తహసీల్దార్‌‌కు ఆ రైతు ఫిర్యాదు చేశాడు.