మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

కర్నూలు జిల్లాలో వాలంటీర్‌ను కొట్టి చంపిన దుండగులు

murder
కర్నూలు జిల్లా ఆందోనీలో ఓ వాలంటీర్‌ను కొందరు గుర్తు తెలియని దుండగులు కొట్టి చంపేశారు. స్థానిక రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన హరిబాబు అనే వాలంటీర్‌ను రాళ్లతో విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. ఈ హత్యతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
 
మరోవైపు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. నిందితుల అరెస్టుతోనే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన వాలంటీర్ హరిబాబు ఆదోనీ వార్డుకు వాలంటీరుగా పని చేస్తున్నారు. 

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ 
 
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన వైఎస్ భాస్కర్ రెడ్డికి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా ఆయనకు 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు ఆయన ఎస్కార్ట్‌పై బయటేవుంటారు. ఎస్కార్ట్‌లో భాగంగా ఆయన వెంట ముగ్గురు పోలీసులు ఓ వాహనం ఉంటుంది.
 
అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ న్యాయస్థానం 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. కాగా, వివేకా హత్య కేసులో ఈ యేడాది ఏప్రిల్ నెలలో భాస్కర్ రెడ్డిని విచారించిన సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి ఆయన చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. ఆయన మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది.