మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (08:40 IST)

ఇంజనీర్‌ను బెదిరించిన నటుడు బాబీసింహా.. కేసు నమోదు

bobby simha
ఓ ఇంజినీర్‌ను బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు బాబీ సింహాతో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దిండిగల్ జిల్లా కొడైకెనాల్‌ విల్‌పట్టి పంచాయతీలోని పేత్తుపారైలో నటుడు బాబీ సింహా కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. అనుమతి ఇచ్చినదానికంటే ఎక్కువ స్థలంలో నిర్మిస్తున్నారని ఆయనపై, అదే ప్రాంతంలో ఇల్లు నిర్మిస్తున్న ప్రకాశ్‌రాజ్‌పై స్థానికులు ఫిర్యాదు చేశారు. 
 
ఇదిలావుంటే, బాబీ సింహాకు, కాంట్రాక్టర్‌ జమీర్‌కు గొడవలు జరగడంతో పనులు మధ్యలో ఆగిపోయాయి. జమీర్‌కు బాబీ సింహా డబ్బులు ఇవ్వలేదని సమాచారం. దీంతో జమీర్‌ బంధువు ఇంజినీర్‌ అయిన హుస్సేన్‌ కొడైకెనాల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
షణ్ముగనూర్‌లోని తన గెస్ట్‌హౌస్‌కు గత నెల 20న నటుడు బాబీసింహా, కేజీఎఫ్‌ సినిమాలో నటించిన రామచంద్రన్‌ రాజ్‌, మరో ఇద్దరు వచ్చి ఇల్లు నిర్మాణ విషయంలో తలదూర్చకూడదని బెదిరించినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో నటుడు బాబీసింహా, రామచంద్రన్‌రాజ్‌ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.