గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:23 IST)

రైతులకు పండగే: సీఎం జగన్ మరో కొత్త పథకం, ఏంటది?

దేశంలోని ఉత్తరాది రైతులు నిరసనలు తీవ్రస్థాయికి వెళ్తున్నాయి. కానీ దక్షిణాదిలో ఆ ఆనవాళ్లు కనిపించడంలేదు. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే.. సీఎం వైస్ జగన్ రైతన్నలను అక్కున చేర్చుకుంటున్నారని పొరుగు రాష్ట్రాల వారే కితాబిస్తున్నారు.
 
తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజు తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు.
 
ఈ పథకం కింద గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో రూ. 1252 కోట్లను జమ చేయనున్నారు. ఫలితంగా సుమారు 9.48 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. కాగా రాష్ట్రంలో కోటీ 14 లక్షల ఎకరాలను ఉచిత పంటల బీమా పథకం కిందకి తీసుకువచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు.