సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

శేషాచలం ఫారెస్ట్ బీట్‌లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

తిరుమల తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతంలోని ఫారెస్ట్ బీట్‌లో అగ్నిప్రమాదం చెలరేగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గత మూడు, నాలుగు రోజులుగా కార్చిచ్చు కల్లోలం రేపుతోంది. అనంతపురంలో అటవీ సంపద దహనం కొనసాగుతోంది. వేలాది ఎకరాల్లో వృక్షాలు, వందల సంఖ్యలో వన్యప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. 
 
ఇదిలావుంటే, శేషాచలం అటవీ ప్రాంతంలో కూడా మంటలు చెలరేగాయి. ఎర్రచందనం స్మగ్లర్ల వల్లే ఈ మంటలు చెలరేగివుంటాయని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలోని కరకంబాడి ఫారెస్ట్ బీట్‌లో ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు వెల్లడించారు. ఆ వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలను అదుపు చేశాయి. 
 
అయితే, శేషాచలం అడవుల్లో తరచుగా చెలరేగుతున్న కార్చిచ్చుతో అరుదైన వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా అపారనష్టం వాటిల్లుతుంది. తరచుగా అగ్నిప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.