గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (07:30 IST)

నిజాంపేట్ శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరం నిజాంపేట రోడ్డులోని కేపీహెచ్‌బీలోని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్‌లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురయ్యారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఆసుపత్రి మొదటి అంతస్తులో భారీ పొగలు వ్యాపించాయి. విపరీతమైన పొగ కారణంగా ఫ్లోర్‌లోని అందరూ ఊపిరి పీల్చుకోలేక పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు.
 
అలాగే, స్థానికులు కూడా అప్రమత్తమై సహాయక చర్యల్లో పాల్గొనగా, ఘటన జరిగినప్పుడు 30 మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్సీ అరికెపూడి గాంధీ, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తదితరులు ఆస్పత్రిని సందర్శించారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.