శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (05:49 IST)

అగ్నిమాపక ఉద్యోగి అగ్నికీలలకు ఆహుతి.. ఎక్కడ?

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఓ అగ్నిమాపక ఉద్యోగి అగ్నికీలలకు ఆహుతి అయ్యాడు.

ఈ సంఘటన పెనుగొండ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పెనుగొండ మండలం రాంపురం సమీపంలోని గుజిరి గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

దీంతో అక్కడివారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమించసాగారు.

ఈ నేపథ్యంలో పరంధామ అనే అగ్నిమాపక ఉద్యోగి మంటల్లో పడి సజీవ దహనమయ్యాడు. భారీగా మంటలు ఎగిసిపడుతుంటంతో వాటిని అదుపుచేయటం సాధ్యంకావటంలేదు. ఇప్పటికే కోటి రూపాలయ ఆస్తి నష్టం సంభవించింది.