గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (10:27 IST)

తిరుమల శ్రీవారికి ఐదు బ్యాట‌రీ ఆటోలు విరాళం

తిరుమల శ్రీవారికి ఐదు బ్యాట‌రీ ఆటోలు విరాళంగా అందింది. వేలూరుకు చెందిన ప్రముఖ బ్యాటరీ ఆటోల తయారీ సంస్థ వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ మరియు ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్లు కలిసి ఈ మేరకు దాదాపు రూ.15 ల‌క్ష‌ల‌ విలువైన ఐదు బ్యాటరీ ఆటోలను అందజేశారు.

శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాతలు వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ ఎం.డి. జి.ఏ. హరికృష్ణ, ఆకెళ్ళ రాఘవేంద్ర ఈ మేరకు ఆటో తాళాలను శ్రీవారి ఆలయ ఇంచార్జ్ డెప్యూటీ ఈవో వెంకటయ్యకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల రవాణా విభాగం డి.ఐ. మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మూడు ఆటోలను కోవిడ్ -19 శానిటేషన్ కోసము, రెండు ఆటోలు తిరుమలలో వ్యర్ధాలను తరలించడానికి  ప్రత్యేకంగా రూపొందించారు.