Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తిరుపతిలో విద్యార్థులు కిడ్నాప్-ముగ్గురు బాలికలు, ఇద్దరు అబ్బాయిలు?

Written By సెల్వి
Updated: బుధవారం, 9 నవంబరు 2022 (17:24 IST)
Kidnap
తిరుపతిలో పదవ తరగతి విద్యార్థులు కిడ్నాప్‌కు గురికావడం సంచలనం సృష్టించింది. తిరుపతిలోని నెహ్రూనగర్‌లో బుధవారం తెల్లవారుజామున స్టడీ అవర్స్‌కు వెళ్లి ముగ్గురు బాలికలు, ఇద్దరు అబ్బాయిలు సహా ఐదుగురు పదో తరగతి విద్యార్థులు కనిపించకుండా పోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 
 
వివరాల్లోకి వెళితే.. మెహత, గుణశ్రీ, మౌనశ్రీ, మరో ఇద్దరు విద్యార్థులు బుధవారం ఉదయం స్టడీ అవర్స్ కోసం వెళ్లి వారి ఇళ్లకు తిరిగి రాలేదు. దీంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు, స్టడీ అవర్స్ సెంటర్‌లో వెతికినా విద్యార్థులు కనిపించలేదు. వారు పాఠశాలకు వెళ్లలేదని సీసీటీవీ ఫుటేజీలో తేలింది.
 
వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించారు. తిరుపతిలోని ఐస్ మహల్ సమీపంలో అన్నమయ్య స్కూల్‌లో మిస్ అయిన విద్యార్థులు పదో తరగతి చదువుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments