గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జులై 2022 (09:32 IST)

రాజమండ్రి వద్ద గోదావరి మహోగ్రరూపం

godavari river
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఏరులై ప్రవహిస్తున్నారు. వరద నీరు అనేక ప్రాంతాలను నీట ముంచేశాయి. ఈ వరద నీటి ప్రవాహంత గోదావరి నది మహోగ్రరూపం దాల్చుతుంది. రాజమండ్రి వద్ద ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 15.37లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 
 
ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వరద 58.5 అడుగులకు చేరుకుంది.
 
బుధవారం ఉదయమే రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. అయితే, సాయంత్రానికి ఈ నీటి ప్రవాహం మరింతగా పెరిగిపోయింది. గోదావరి నదిలో వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీచేసింది. అయితే వరద తగ్గుముఖం పడుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
 
'సాయంత్రం నాటికి తీవ్రత తగ్గవచ్చు, కానీ ఇప్పటికీ హాని కలిగించే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి' అని అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.