గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (13:01 IST)

ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ మాజీ జాయింట్ డైరక్టర్ అనుమాన స్పద మృతి

ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ (ఏపీఎఫ్‌ఎస్‌ఎల్) మాజీ జాయింట్ డైరెక్టర్ ఎక్కరాజు శివ కుమార్ శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివ కుమార్ (74) తన కుటుంబంతో సహా కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు.
 
ఆయన ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. కోర్టు కేసుకు హాజరయ్యేందుకు విజయవాడ వచ్చినట్లు సమాచారం. అయితే ఆయన బసచేసిన గది చాలా సేపటికి మూసే వుంచడంతో అనుమానం వచ్చింది. 
 
అలాగే డోర్‌బెల్స్‌కు ఆయన  స్పందించకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హోటల్‌లో మద్యం సీసా, ఇతర ఆధారాలను పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగించారు.