గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2024 (22:29 IST)

ఏపీలో నాలుగు నెలల పాప వరల్డ్ రికార్డ్

Four-month-old
Four-month-old
ఏపీలో నాలుగు నెలల పాప వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీట్‌ని సాధించి వరల్డ్ రికార్డు సృష్టించింది. కైవల్య అనే 4 నెలల పాప.. పక్షులు, కూరగాయలు, జంతువులు ఇలా 120 రకాల ఫోటోలు గుర్తించగలదు. 
 
కైవల్య తల్లి హేమ తన పాప ప్రత్యేక ప్రతిభను గుర్తించి వీడియో రికార్డ్ చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపింది.  రెండు రోజులు క్రితం నోబెల్ వరల్డ్ రికార్డ్ సంబంధించిన సర్టిఫికెట్, పతాకాన్ని తమకు అందాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
టాలెంట్ ఉంటే ఎంతటి అవరోధాన్ని అయిన అందుకోవచ్చు అనే దానికి నిదర్శనం మా నాలుగు నెలల పాప కైవల్య అని ఆ చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.