శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (19:41 IST)

పేదల‌కు 10కేజీల చొప్పున ఉచితంగా బియ్యం

ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందించేందుకు సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మే, జూన్‌ రెండు నెలలపాటు పేదలకు ఉచిత బియ్యం అందించనుంది.

కేంద్రం ఇచ్చే 5 కేజీల బియ్యానికి అదనంగా మరో 5 కేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. సీఎం జగన్‌ నిర్ణయంతో మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది.

కేంద్రం ఇచ్చే రేషన్‌ బియ్యంతో 88 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 59 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.