శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:28 IST)

జి కొండూరు యంపిపీ గా వేములకొండ తిరుపతమ్మ

అందరు కలిసి ఏకాభిప్రాయంతోనే మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష , కో -అప్షన్ సభ్యుని ఎంపిక చేసుకోవాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు స్పష్టం చేశారు. గురువారం జి కొండూరులో నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్,  మండల పరిషత్ సభ్యులు స్థానిక పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ, మండలంలో 16 సెగ్మెంట్ లకు, 14 స్దానాలో వైసీపీ బలపరిచిన అభ్య‌ర్థులు విజయం సాధించార‌ని, అందరూ  సమిష్టిగా పని చేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వారికి అవసరమైన సేవలందించాలని సూచించారు.
 
అనంతరం యంపిపి గా వెల్లటూరు నుంచి ఎన్నికైన వేములకోండ తిరుపతమ్మను అందరి ఆమోదంతో ఎంపిక చేశారు. వైస్ యంపిపీ గా కవులూరు నుంచి ఎన్నికైన ఈలప్రోలు తేజ, కో-ఆప్షన్ మెంబర్ గా మైలవరం కు చెందిన షేక్ హుస్సేన్ని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం అధికారికంగా జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ణప్తి చేశారు.