గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జులై 2020 (13:16 IST)

ఆగస్టు 15న వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరనున్నారా?.. ఇప్పటికే ఆయన మంతనాలు జరిపారా?.. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారా?.. అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.

ఆగస్టు 15న ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వైసీపీలో గంటా చేరిక ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను కూడా ముగించినట్లు సమాచారం.

గంటా చేరికకు సీఎం జగన్ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ప్రభుత్వం తలపోసింది.

ఈ కార్యక్రమం వేదికగానే గంటా వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.