శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (15:51 IST)

ఫేస్‌బుక్ పరిచయం.. నరకాన్ని చూసిన యువతి.. బీటెక్ యువతి గ్యాంగ్ రేప్

ఫేస్‌బుక్ పరిచయం ఓ యువతికి నరకం చూసింది. అంతేనా.. అత్యాచారానికి కూడా గురైంది. ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన ఆ యువతి బీటెక్ పట్టభద్రురాలు కావడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే....

ఫేస్‌బుక్ పరిచయం ఓ యువతికి నరకం చూసింది. అంతేనా.. అత్యాచారానికి కూడా గురైంది. ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన ఆ యువతి బీటెక్ పట్టభద్రురాలు కావడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
విజయవాడకు చెందిన బీటెక్ యువతికి శ్రీకాంత్ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. తర్వాత ఈ పరిచయం మరింత పెరిగింది. దీంతో ఒకరికొకరు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌లో ఛాటింగులు, గంటల తరబడి కబుర్లు ఇలా ప్రేమ లోకంలో విహరించారు. 
 
ఈ పరిచయం మరింత లోతుకు వెళ్లడంతో ఆమెను శ్రీకాంత్ తన స్నేహితుల రూంకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు కూల‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి, సామూహిక అత్యాచారాని (గ్యాంగ్ రేప్)కి పాల్పడ్డారు. అనంతరం ఇంటికి చేరిన యువతి, జరిగిన దారుణం తల్లిదండ్రులకు వివరించడంతో వారంతా వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.